కారేపల్లి,మహా:
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్
నాయక్ – లలిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను శనివారం సింగరేణి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జంట అందరికి ఆదర్శం గా ఉండి,కలకాలం అష్టైశ్వర్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బానోత్ హీరాలాల్, మోతి వీరాస్వామి,అంగోత్ మతృ,నునావత్ కిరణ్,సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య,పార్టీ జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్,మేదరి రాజా, మండల పరిషత్ కో ఆప్షన్ మాజీ సభ్యులు హనీఫ్,మండల కిసాన్ ఖేత్ కడియాల సుధాకర్,తదితరులు పాల్గొన్నారు
Post Views: 197








