Mahaa Daily Exclusive

  కన్నుల పండువగా జీవద్వజ, గంగమ్మ,పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..

Share

 

కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురం లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవ ధ్వజ యంత్ర పుణప్రతిష్ట,గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు.సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ,నిర్వాహక కమిటీ,ప్రముఖ పురోహితుడు బ్రహ్మ రాజు అచ్యుత రామారావు శర్మతో కలిసి వేద పండితులు నాగసాయి శర్మ,కిరణ్ కుమార్ శర్మ,ఆదిత్య శర్మ,రాము శర్మలు మూడు రోజులపాటు ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యేక పూజలు శాస్త్రోతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ,కర్మణ, పుణ్యాహవచనం, గర్తన్యాసము,జీవద్వాజ యంత్రస్థాపన,ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన, పూర్ణహుతి,మండప ఉద్వాసనలు,ఆశీర్వచనము కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు లింగం బంజార,రామలింగాపురం గ్రామస్తులతో పాటు సమీప గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు.