కారేపల్లి, మహా :రైతులు ప్రధానంగా అధిక దిగుబడుల కోసం చెరువు మట్టి పంట పొలాల్లో వినియోగిస్తే భూమిలో పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు అని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం అప్పాయిగూడెం చెరువు నందు ఇరిగేషన్ శాఖ రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వమాట్లాడుతూ వ్యవసాయ భూములలో చెరువు మట్టిని వేసుకోవడం వల్ల పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని వారు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ బి వెంకట్ నాయక్ ఇరిగేషన్ ఏఈ నాగయ్య అప్పారావు అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్, ఏఈవో మున్ని రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 88








