- ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు.
- కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెడతాం..
- సర్వే నెంబర్ 59 లో గల భవనాన్ని స్వాధీనం చేసుకుంటాం…
- తహసీల్దార్ మహిపాల్ రెడ్డి.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో గల ప్రభుత్వ భూమి గల్లంతు అనే వార్త కథనాన్ని మహా పత్రిక ప్రచురించటంతో ఆ కధనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమేరకు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కొండాపూర్ సర్వే నెంబర్ 59 లో గల 600 చదరపు గజాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్న బహుళంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకుంటామని శేలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మహా పత్రిక ప్రతినిధికి తెలిపారు. ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి జీ హెచ్ ఎం సీ నుండి నిర్మాణ అనుమతులు పొందారని, ఆ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలనీ లేఖ రాసామన్నారు. ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా సరే వదిలి పెట్టమన్నారు. అలాగే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. మండల పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే జైలుకు వెళతారని ఆయన హెచ్చరించారు.








