ఆదిలాబాద్ మహా :
ఆదిలాబాద్ పట్టణంలోని 23వ ,31వ వార్డులలోని తాటిగూడ,అంబేద్కర్ కాలనీ లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు డోమటి లావణ్య, వాంఖడే తానుబాయి – మాధవ్ దంపతులు,అలాగే అస్మా బేగం నూతనంగా నిర్మించుకున్న గృహాలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రులు నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారులను అభినందించారు. వారికి నూతన వస్త్రాలు అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు .రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.








