Mahaa Daily Exclusive

  సీయంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు కంది శ్రీ‌నివాస రెడ్డి కార్యాయంలో కార్య‌క్ర‌మం

Share

ఆదిలాబాద్ మ‌హా :

పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాయంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య మంత్రి స‌హాయ నిధినుండి వ‌చ్చిన చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేసారు. మొత్తం 15ల‌క్ష‌ల 55వేల 5వంద‌ల విలువ గ‌ల 33 చెక్కుల‌ను అందించారు. కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ,టీఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఫహిం ఖురేషి , టీజీఎంఎఫ్ సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ , ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డీసీసీ అధ్య‌క్షుడు న‌రేష్ జాదవ్ , అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి , మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ బండారి అనూష‌, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ శ్రీ‌కాంత్ రెడ్డి , ఆత్మ క‌మిటీ చైర్మ‌న్ గిమ్మ‌సంతోష్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.