ఆదిలాబాద్, నిర్మల్ లో బిజెపి ఎమ్మెల్యేలదే నడుస్తోంది
కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలి?
ఇన్ ఛార్జ్ మంత్రి ముందు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆవేదన
ఆదిలాబాద్, మహా
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి.. తమను ఎవరూ పట్టించుకోవడగం లేదని, ముక్కుముఖం తెలియనివాళ్ళకు పదవులు ఎట్ల వస్తున్నయో అర్ధంకాకుండా వస్తున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ ది నడుస్తంది.. లేదంటే జోగురామన్నది నడుస్తది. నిర్మల్ లో మహేశ్వరరెడ్డిది నడుస్తంది. డిసిసిలు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలకు ఏది గౌరవం.. ఒక కార్యకర్తకు అపాయింట్ మెంట్ చేస్తమంటే దిక్కులేదు. మేం ఇస్తే ఎవరూ పట్టించుకోవట్లే. ఇట్లయితే కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తాం. ఎలా పార్టీని ముందుకుతీసుకువెళ్తాం అంటూ బొజ్జు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని పూర్తిగా మార్చాలని విజ్ఞప్తిచేశారు.








