Mahaa Daily Exclusive

  విశ్వహిందూ పరిషత్ఆధ్వర్యంలో యజ్ఞం,,,

Share

 

వేములవాడ,మహా
గత కొన్ని రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, లోక కళ్యాణం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతు రావు నగర్‌లోని గాయత్రి మాత ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య హోమాన్ని నిర్వహించగా, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ వేములవాడ పట్టణ అధ్యక్షులు పల్లె శ్యాంసుందర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి గోపాల్, చందనము రాజేష్, ఉపాధ్యక్షులు చేకుర్తి నవీన్,అజయ్ విశాల్, సహ కార్యదర్శి పుల్లూరిఆంజనేయులు, సామాజిక సమరసత ప్రముక్ జక్కం శివప్రసాద్, బజరంగ్దళ్ సహ సంయోజక్ హర చారి శ్రీరామ్ శర్మ,సాయి కృష్ణ, జిల్లా సహా కార్యదర్శిలు గడప కిషోర్ రావు, నాగులరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పంటలు సమృద్ధిగా పండించి సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం,ఆరోగ్యం,ఆయురారోగ్యాలుకలగాలనిగాయత్రిమాతను ప్రార్థించినట్లు తెలిపారు.