Mahaa Daily Exclusive

  ఓటు హక్కు పరిరక్షణకు ముందుకు రావాలి…..

Share

  • ఓటు హక్కు పరిరక్షణకు ముందుకు రావాలి
  •  బీఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల్ యూత్ ఉపాధ్యక్షులు వడ్ల కాళిదాస్ చారి

మొయినాబాద్ మహా: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభంమని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దానిని పరిరక్షించుకోవడానికి ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల యూత్ ఉపాధ్యక్షులు కాళిదాస్ చారి విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ద్వారా ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓటరు జాబితాలో పేర్లు చిరునామాలు వయస్సు తదితర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఓటరు జాబితాలో పేరు లేని వారు సంబంధిత అధికారులను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నందున ప్రజలు వారికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణ అనేది కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమైన సామాజిక కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన ఓటరు జాబితాలు ఎంతో అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఓటరు చురుకుగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు ఇతరులను కూడా అవగాహన కల్పించాలని కాళిదాస్ చారి విజ్ఞప్తి చేశారు.

* బీఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల్ యూత్ ఉపాధ్యక్షులు వడ్ల కాళిదాస్ చారి

Latest