ఖైరతాబాద్, మహా :
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం, ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని తాత నగర్‌లో నిశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మన్నె గోవర్ధన్ రెడ్డి, ఓటరు నమోదు మరియు సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం సూపర్వైజర్ వెంకటేష్, 77వ డివిజన్ బూత్ స్థాయి అధికారి మౌనిక, 78వ డివిజన్ బూత్ స్థాయి అధికారి సంఘమిత్రలతో పాటు బూత్ స్థాయి ఏజెంట్లు దస్తగిరి , భరత్‌లతో కలిసి ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన ప్రక్రియను మన్నె గోవర్ధన్ రెడ్డి సమీక్షించారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే, నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకొని, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, బాలరాజు యాదవ్, క్రాంతి, ప్రభాకర్ రెడ్డి, బిట్ల శ్రీనివాస్ రాజ్, రోహిత్ కుమార్, రావుల విజయ్ కుమార్, శ్రీధర్ మరియు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








