హైదరాబాద్, మహా : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ11గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. మూవీ షూటింగ్ కారణంగా ముంబయిలో ఉండడంతో ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. గత విచారణలోనూ బన్నీ వర్చువల్‌గానే హాజరయ్యారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లయింది. నిందితులుగా చేర్చిన వారిలో కొంతమంది వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అందరూ హాజరైతేనే తదుపరి విచారణ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేస్తూ ఈ నెల 29కి వాయిదా వేసింది. పోలీసులు ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చారు. వీరిపై 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు.
Post Views: 3








