Mahaa Daily Exclusive

  విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలి…

Share

విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలి

*జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం

*కారేపల్లి కేజీబీవీని సందర్శించిన డీఈవో

కారేపల్లి, మహా:విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం అన్నారు. కారేపల్లి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డిఇఓ గురువారం సందర్శించారు. పదవ తరగతి విద్యార్థినిలతో డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థి జీవితం ఎంతో విలువైనదని, పాఠశాల దశలోనే భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణం గా పట్టుదలతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చదువుపై దృష్టి సాధించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం తయారు చేసే సిబ్బంది కి సూచనలు చేశారు. మండలంలోని విద్యార్థుల కోసం తయారు చేస్తున్న ఏకరూప దుస్తులను పరిశీలించారు. దుస్తుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా వచ్చేవారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ బాజోజు ప్రవీణ్ కుమార్, కేజీబీవీ సిఆర్టీ లు ఝాన్సీ, సమీనా పాల్గొన్నారు.