- కారేపల్లిలో పోలీసుల తనిఖీలు
- మాదకదవ్యాలు విక్రయిస్తే జైలుకే – ఎస్సై గోపి
కారేపల్లి, మహా:గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు నేపధ్యంలో కారేపల్లిలో ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని చాక్లెట్లు, సిగరెట్లు, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ,పాన్ షాపులు,కిరాణా దుకాణాలపై దృష్టి పెట్టారు. మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై బైరు గోపి సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే కారేపల్లి పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Post Views: 62








