Mahaa Daily Exclusive

  డ్రా ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక….

Share

*డ్రా ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక*

*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

వరంగల్, బ్యూరో మహా ;

ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో డ్రా విధానం ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా డ్రా నిర్వహించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ వివరాల ప్రకారం,5వ తరగతిలో మొత్తం 62 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడతలో 52 దరఖాస్తులు మాత్రమే అందాయి. దీంతో మిగిలిన 10 సీట్ల భర్తీ కోసం రెండో విడతలో 17 దరఖాస్తులు స్వీకరించారు. 10 సీట్లకు 17 మంది అర్హులు ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రా నిర్వహించి 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, మిగిలిన 7 మందిని వెయిటింగ్ లిస్టులో ప్రాధాన్యత క్రమంలో ఉంచారు.
డ్రా ద్వారా ఎంపికైన విద్యార్థులు శివాని స్కూల్, నర్సంపేట ఏవీఎస్ స్కూల్, ధర్మారం; వందన స్కూల్, వరంగల్; విద్యోదయ స్కూల్, నెక్కొండ తదితర పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్సీ డీఈవో పుష్పలత, DCO డి సి ఓ సోషల్ వెల్ఫేర్ సరిత, అకాడెమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుజన్ తేజ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.