- మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారు
- – పదోసారి కూడా ఎమ్మెల్యేను అవుతానని ధీమా
అమరావతి, మహా-
ఏపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్-2047పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఐదోసారి కూడా ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారని, మళ్లీ మనమందరం గెలిచి విజన్ 5.0ను కూడా తీసుకువద్దామని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉందని, అక్కడ బీజేపీనే గెలుస్తోందని తెలిపారు. హర్యానాలోనూ బీజేపీ మూడో పర్యాయం విజయం సాధించిందని అన్నారు.
Post Views: 31