కారేపల్లి,మహ : పోరాటాలతోనే కార్మికుల హక్కుల రక్షించబడతాయని సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర అన్నారు. మంగళవారం కారేపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జనరల్ బాడీ సమావేశం యూనియన్ మండల అధ్యక్షురాలు వాంకుడోత్ కమల అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో కే.నరేంద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే విధంగా ప్రజా ఉద్యమాలకు బాధిత కార్మికులు మద్దతు ఇవ్వాలన్నారు. గ్రామాలలో వైద్య శాఖ వెన్నుముక్కగా ఉన్నఆరోగ్యకార్యకర్తలు(ఆశా) పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులగాగుర్తించి కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆగస్టు 10న జరగనున్న జైల్ భరో ను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జిల్లా నాయకురాలు వై.రాధ, పద్మ, జంగా కళ్యాణి, ఈసం ఈశ్వరి, సరస్వతి, వై పద్మ, ఆదెర్ల దేవకరణ, మేదరి కుమారి, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల వైద్యాధికారి డాక్టర్ బీ.సురేష్ కు వినతిపత్రం అందజేశారు.







