కారేపల్లి, మహ: కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గం , ఇళ్లలో పూర్తిగా నీటితో నిండిపోవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బానోత్ హీరాలాల్ దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అత్యవసర చర్యల్లో భాగంగా జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని, చెత్తను తొలగించి నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో ఇళ్లలోకి చేరిన నీరు తగ్గి, బాధితులు ముపు నుంచి ఉపశమనం పొందారు.
సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సర్పంచ్ హీరాలాల్ తీసుకున్న చొరవను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోత్ బీక్కులాల్ , పంచాయతీ కార్యదర్శి,పెండ్ర అనిల్,వార్డు సభ్యులు వాంకుడోత్ గాంధీ, గుగులోత్ భీముడు , పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







