Mahaa Daily Exclusive

  తెలంగాణ రాష్ట్ర ప్రతీక బోనాల పండుగ…

Share

  • తెలంగాణ రాష్ట్ర ప్రతీక బోనాల పండుగ
  • డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి
  • ఆదిభట్ల సర్కిల్లో బోనాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం!
  • అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

 

ఇబ్రహీంపట్నం ఆగస్టు 4 మహా:

తెలంగాణ రాష్ట్ర ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని, ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అన్నారు. మంగళవారం ఆదిభట్ల సర్కిల్–15 పరిధిలోని రాగన్నగూడ కార్యాలయంలో ఆషాఢ మాసం, శ్రావణ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి, అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, జిహెచ్ఎంసి ఆదిభట్ల సర్కిల్–15 పరిధిలోని డివిజన్లు, అన్ని గ్రామాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా సానిటేషన్, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల శుభ్రత, తాగునీటి సరఫరా, రహదారులపై ఉన్న గుంతల మరమ్మతులు, డ్రైనేజీల శుభ్రత తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లోని దేవాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ఎక్కడాకూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ శానిటేషన్ స్వర్ణకుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భిక్షపతి, శానిటేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ యోగేందర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాధిక, చంద్రశేఖర్, సానిటేషన్ సూపర్వైజర్లు, ఎస్‌ఎఫ్‌ఏలు, ఎలక్ట్రిషియన్లు, వాటర్‌మ్యాన్‌లు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.