Mahaa Daily Exclusive

  రేవంత్ ప్రచారం చేసిన స్థానాల్లో.. కాంగ్రెస్ విజయం..

Share

  • నాలుగుస్థానాల్లో భారీ ఆధిక్యాలు
  • బిఆర్ఎస్ ప్రచారంపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఫైర్

 

హైదరాబాద్, మహా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవలేదంటూ బిఆర్ఎస్ శ్రేణులుసోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముగ్గురూ కలిసి ప్రచారం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది గుండుసున్నే కదా అంటూ కాంగ్రెస్ వారియర్లు కౌంటరిస్తున్నారు. దీనికితోడు సీఎం రేవంత్ ప్రచారం చేసిన ముంబాదేవి నియోజకవర్గంలో అమిన్ పటేల్, దారావిలో జ్యోతి గైక్వాడ్, కడెగావ్ లో కాడం విశ్వజిత్ , శివసేన ఉద్దవ్ నుండి పోటీచేసిన ఆదిత్య ఉద్దవ్ థాక్రే వర్లిలో గెలిచారని మెజారిటీలతో సహా సోషల్ మీడియాలో పెట్టారు. ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల ముంబాదేవి, దారావి, కడెగావ్, వర్లిలో కాంగ్రెస్, శివసేన ఉద్దవ్ గెలిచాయని ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ట్వీట్ చేశారు. సీఎంకు అభినందనలు తెలిపారు.