Mahaa Daily Exclusive

  పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని యువత రాజకీయాల్లోకి రావాలి..మన్ కీ బాత్ లో మోడీ పిలుపు..

Share

  • పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వద్దు
  • పట్టణీకరణ పెరిగే కొద్దీ అవి కనుమరుగవుతున్నాయి

 

ఢిల్లీ, మహా

 

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ 116వ ఎపిసోడ్‌లో ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వచ్చే ఏడాది స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జీవ వైవిద్య నిర్వహణలో కీలకపాత్ర పోషించే పిచ్చుకల కనుమరుగుపైనా ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేశారు. పట్టణీకరణ కార‌ణంగా పిచ్చుక‌లు త‌గ్గిపోయిన‌ట్లు పేర్కొన్నారు. పట్టణీకరణ పెరిగిన కొద్ది పిచ్చుకలు కనుమరుగవుతూ వచ్చాయని, ఇప్పుడు ప‌ట్ట‌ణాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదని ప్రధాని ఆవేదన వ్య‌క్తం చేశారు. తిరిగి వాటి జనాభాను పెంచాల్సిన అవసరం చాలా ఉందని మోడీ గుర్తు చేశారు. చెన్నైలోని కుడుగల్‌ ట్రస్ట్‌ పిచ్చుకల జనాభా పెంపు కోసం చేస్తున్న కృషిని ప్రధాని ప్ర‌శంసించారు. ఈ ట్రస్ట్‌ వారు పిచ్చుకల జనాభా పెంచే ప్రయత్నంలో పాఠ‌శాల‌ పిల్లలను కూడా భాగస్వాములను చేయ‌డం ప్ర‌శంస‌నీయం అన్నారు. రోజువారీ జీవితంలో పిచ్చుకల ప్రాముఖ్యాన్ని గురించి కుడుగల్‌ ట్రస్ట్‌ వారు పిల్లలకు వివరిస్తున్నార‌ని గుర్తు చేశారు.