మహా: యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అదానీ విరాళాన్ని తిరస్కరించారు గానీ, మరి ఒప్పందాల సంగతేమిటంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కూడా తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Post Views: 20