ఆదిలాబాద్ మహా : శుభ ముహుర్తాలు ప్రారంభం కావడంతో శుభ కార్యాలు జోరందుకున్నాయి. అభిమానంతో ఆహ్వానించినవారి వేడుకలకు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఆదిలాబాద్ రూరల్ మండలం న్యూ రాంపూర్ గ్రామంలో గల దోర్శెట్టి రాజు, లింగన్న నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కంది శ్రీనన్న కానుకను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు వివాహ వేడుకలకు సైతం అటెండయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి కానుకలు అందజేశారు.ఆమె వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,నాయకులు బూర్ల శంకరయ్య,దాసరి ఆశన్న,గడ్డం అఖిల్ రెడ్డి,రావుల సోమన్న తదితరులు పాల్గొన్నారు.
Post Views: 25