- మాటల్లో కాదు… చేతల్లో చూపించిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు!
- ఏరియా ఆసుపత్రిలో ‘అవయవదాన పక్షోత్సవాలు’ పోస్టర్ ఆవిష్కరణ.
- స్వయంగా ఆధార్ కార్డు ఇచ్చి అవయవదాన రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎమ్మెల్యే.
- మానవత్వానికి ఆదర్శంగా నిలిచి, ప్రజాచైతన్యానికి పిలుప
బాపట్ల ,మహ
ఒక ఉత్తమ నాయకుడు ప్రసంగించడమే కాదు… తనే ముందడుగు వేసి సమాజానికి దిశానిర్దేశం చేస్తారని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు మరోసారి నిరూపించారు.బాపట్ల ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన “అవయవదాన పక్షోత్సవాల” కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అవయవదాన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా తన ఆధార్ కార్డు వివరాలను అందించి, మొదటి వ్యక్తిగా అవయవదాన రిజిస్ట్రేషన్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.అవయవదానంపై సమాజంలో ఉన్న అపోహలను తుడిచిపెడుతూ, ప్రజాప్రతినిధిగా తానే ముందుండి శ్రీకారం చుట్టడంపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, వైద్య వర్గాలు మరియు నెటిజన్లు ఎమ్మెల్యే పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “మరణం తర్వాత కూడా మరొకరికి ప్రాణదానం చేసేందుకు సిద్ధపడటం ఎమ్మెల్యే ఉదార మనస్సుకు, మానవత్వానికి నిదర్శనం” అని పలువురు కొనియాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:- అవయవదానం అంటే మరొకరికి పునర్జన్మ ఇవ్వడమే! మన రహితం తర్వాత కూడా మన అవయవాల ద్వారా మరికొందరిలో మనం జీవించి ఉండవచ్చు. ప్రసంగాలు చేయడం కంటే స్వయంగా ఆచరించి చూపించడమే సరైన మార్గమని భావించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నారు. అవయవదానంలో తానే స్వయంగా ముందుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గొప్ప సందేశాన్ని అందించారు. మన రహితం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపే గొప్ప అవకాశం అవయవదానం. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించే అవయవాలు ఎంతో మంది ప్రాణాలను కా6పాడతాయి” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను వీడి, ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏరియా వైద్యశాల నిర్వహించిన ఈ అవగాహన పక్షోత్సవాల కార్యక్రమాన్ని, వైద్యులు మరియు సిబ్బంది కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు,ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







