•ప్రిన్సిపాల్ భజనలో ముగ్గురు అధ్యాపకులు
•బోధన కంటే భజనకే ప్రాముఖ్యత
•అటెండరే ఇక్కడ అధ్యాపకుడు
•పర్యవేక్షణ లోపం కళాశాలకు శాపం
కారేపల్లి, మహ : కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన గురువులు,ప్రధానాచార్యులకు బాకాలుగా మారి ఆమె ప్రాపకం కోసం భజనలతో కాలక్షేపం చేస్తుండడం విద్యార్జులు చదువులపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కోటరీ ఏర్పాటు చేసుకోని కోటరికి ప్రత్యేక సదుపాయాలు, వెసులు బాట్లు కల్పించటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. కోటరీలోని వ్యక్తులు సమయపాలన పాటించకున్నా, పాఠాలు బోధించకున్నా ఎవరికి పట్టనట్టు ఉందని విద్యార్ధలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. విద్యార్ధులకు ఆంగ్లం బోధన ఎంతో ప్రాముఖ్యతో ఉందో తెలిసికూడా కళాశాలలో ఉన్న జనరల్, ఓకేషనల్ గ్రూపులన్నింటిని కలిపి రెండు పిరియడ్లతో సరిపుచ్చటం విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడుకోవటం కాదా ? 111 మంది విద్యార్థులను హాల్ లో కూర్చోబెట్టి సెమినార్ చెప్పినట్లు చెప్పితే ఎవరికి అర్ధం అవుతుందో ఆ అధ్యాపకురాలు, ప్రిన్సిపాల్ కే తెలియాలి. రోజు రెండు పిరియడ్ లు భోధించి తర్వాత కాలక్షేపంతోనే సరిపుచ్చుకోవటం ఆ కళాశాల గురువులకే చెల్లుతుంది. ఇంగ్లీషుకు స్టడీ అవర్ అనే మాటే లేదు.
*ల్యాబ్ అటెండరే అధ్యాపకుడు*
ల్యాబ్ లో సహాయకునిగా ఉండే అటెండర్ తో విద్యాబోధన వింతగా ఉంది. ఎంపీహెచ్ డబ్య్లూ కు ఒకరే అధ్యాపకులు ఉన్నారు. ఆ గ్రూపులో విద్యాబోధనకు సైన్స్ అధ్యాపకులకు అదనపు బాధ్యతలు అప్పగించాల్సిన ప్రిన్సిపాల్ కు పట్టకపోవటంతో ల్యాబ్ అటెండరే అధ్యాపకుడిగా మారాడు. ఇక పిల్లలేమో అటెండర్లు గా మారి సేవలు చేస్తున్నారు. గతంలో కళాశాలలకు విద్యార్దులు సెల్ పోన్ తీసుకవస్తేనే అప్పటి ప్రిన్సిపాల్ సహించేవారు కాదు. అలాంటిది కారేపల్లి కళాశాలలో అధ్యాపకులే పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వటం విడ్డూరంగా ఉంది. గురువులు, శిష్యుల మధ్య ఉండే సంబంధం ఎంతో పవిత్రమైనది. అలాంటిది కళాశాలలో విద్యార్ధులపై చెప్పులు విసరటం, బూతులు తిట్టటం నేటి కారేపల్లి కళాశాల అధ్యాపకుల తీరు. ఇక కళాశాలలో వార్షిక పరీక్షా ఫలితాలలో ఫూర్ ఫలితాలు రావటం, అనంతరం జరిగే సప్లిమెంటర్ పరీక్షలలో మాత్రం ఉత్తీర్ణత శాతం అమాంత పెరగటం విశేషం, రహస్యం ఏమిటో ప్రిన్సిపాల్, వారికి భోదించే అధ్యాపకులకే తెలియాలి.
పర్యవేక్షణ లోపం కళాశాలకు శాపం
కళాశాలపై పర్యవేక్షణ లోపం విద్యార్ధుల భవిష్యత్తుకు శాపంగా పరిణమించింది. కళాశాలకు వస్తున్న అధికారులు విద్యాభోధన, అవసరాలు. సమస్యలను విద్యార్ధులతో చర్చించే తీరిక ఉండటం లేదు. మొక్కుబడి తనిఖీలతో వచ్చామా? పోయామా అనే రీతిలో ఉండటంతో బాధ్యతరహిత్యం పెరిగిపోయింది. దీంతో పిల్లలకు కొంతైనన్యాయం చేద్దామనుకునే అధ్యాపకులలో ఆసక్తి సన్నగిల్లే పరిస్ధతి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కారేపల్లి ప్రభుత్వకళాశాలలో జరిగే పరిణామాలు, విద్యాబోధన పై దృష్టి పెట్టి పిల్లల భవిష్యత్తుకు బాటలువేయాలని విద్యావేతలు కోరుతున్నారు.








