•అటవీశాఖ లాంఛనాలతో ఉద్యోగి అంత్యక్రియలు
•నివాళ్లు ఆర్పించిన కలెక్టర్, డీఎఫ్వో, ఎమ్మెల్యే
•ప్రభుత్వం ద్వారా త్వరితంగా బెనిఫిట్స్
కారేపల్లి, మహ: విద్యుత్ తో అడవి జంతువుల వేటను అడ్డుకోవటానికి వెళ్లి వేటగాళ్లు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ అంత్యక్రియలు బుధవారం సింగరేణి మండలం వెంకట్యాతండాలో జరిగింది. సింగరేణి మాజీ ఎంపీపీ బానోత్ దేవ్లానాయక్, వెంకిట్యాతండా సర్పంచ్ బానోత్ బూలీ ల చిన్న కుమారుడైన నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రేంజ్ పరిధిలోని చెరువు సింగారం వేస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు నెలల క్రితం అక్కడి బదిలీ కావటం అక్కడ విధి నిర్వాహణలో మృతి చెందటంతో మండలంలో విషాధచ్చాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని ఖమ్మం జిల్లా కలెకట్ర్ దివాకర టీ.ఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎఫ్వో సిదార్ధ విక్రమ్ సింగ్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సందర్శించి నివాళ్లు అర్పించారు. విధి నిర్వాహణలో మృతి చెందిన నవీన్ కుటుంబానికి అన్ని విధాల అదుకుంటామని అధికారులు, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా, అటవీశాఖ ద్వారా అందాల్సిన బెనిఫిట్స్ ను త్వరితగతిన అందేలా చూడాలని, విధి నిర్వాహణలో మృతి చెందితో రూ.కోటి ఇస్తామన్నా సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కుటుంబ సభ్యులు వివిధ పార్టీలనాయకులు డిమాండ్ చేశారు.
*కారేపల్లిలో భారీ ఊరేగింపు*
భద్రాచలం నుండి ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతదేహం కారేపల్లి తీసుకవస్తున్న సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. యువకులు అధిక సంఖ్య పాల్గొని తోటి మిత్రునికి నివాళ్లు ఆర్పించారు. భ్రదాచలం అసుప్రతిలో నవీన్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సందర్శించి నివాళ్లు ఆర్పించారు. మృత దేహాన్ని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు పగడాల మంజుల, బానోత్ రాంమ్మూర్తి, మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, నాయకులు నర్సింగ్ శ్రీనివాసరావు, అడ్డగోడ ఐలయ్య, పెద్దబోయిన ఉమాశంకర్, గుడిపుడి తిరుమలరావు, గుగులోత్ భీముడు, కడియాల సుధాకర్, ఈసాల నాగేశ్వరరావు, వాంకుడోత్ గోపాల్, సర్పంచ్ లు భూక్య రంజిత్, బానోత్ హీరాలాల్, మేదరి వీర్రపతాప్, పొడుగు పెంటయ్య, ఈసాల వెంకటేశ్వర్లు, కల్తి భద్రయ్య, దారావత్ మంగీలాల్, బీఆర్ఎస్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, అడపా పుల్లారావు, లాకావత్ లక్ష్మన్, వాంకుడోత్ జగన్, సీపీఎం నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, కే.నరేంద్ర తదితరులు ఉన్నారు.








