•మృతురాలి చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చంద్రావతి
•తల్లిని కోల్పోయిన కూతుళ్లకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే
కారేపల్లి, మహ : సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మహిళ రైతు వడ్డే ఉమా సంతాప సభ గురువారం ఆమె స్వగ్రామంలో జరిగింది.వైరా నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు చంద్రావతి సంతాప సభకు హాజరై ఉమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతురాలుకు ఇద్దరు కూతుర్లు కాగా తల్లిని కోల్పోయిన ఆడబిడ్డలను దగ్గరకు తీసుకొని ఓదార్చి ధైర్యం చెప్పారు.అకాల మృతి చెందిన తమ తల్లి మీపై పెట్టుకున్న కలలను సాకారం చేసి ఆమె ఆత్మకు శాంతిని కలిగింప చేయాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,బీఆర్ఎస్ నాయకులు జిల్లా యువజన నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, నాయకులు తాత వెంకటేశ్వర్లు,తాత ఉపేందర్, సురపరెడ్డి రవీందర్ రెడ్డి, చాగంటి కోటయ్య,తమ్మిని ముత్తయ్య,దొంతు దాసు, వడ్డే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.








