అమరావతి,
మహా
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట కుప్ప కూలిపోయింది. ప్రభుత్వాల జోక్యం తో, అధికారుల అవినీతి తో వేలాది నిరుద్యోగుల బతుకులు రోడ్డున పడ్డాయి. హైకోర్టు ఆదేశం తో సిట్ విచారణలో పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాల బాగోతం బయట పడింది. ఈ నివేదిక లో 97.55 శాతం దిద్దుబాట్లు, మార్పులు వున్నట్టు సిట్ స్పష్టం చేసింది. సిట్ ఈ ఘోరమైన వాస్తవాలను హైకోర్టు కు నివేదించింది. సెప్టెంబర్ ఛఒకటవ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు ఈ కేసు వాయిదా వుంది. సిట్ ఇంత స్పష్టంగా ఇచ్చిన
కుప్పకూలిన ఏపీపీఎస్సీ ప్రతిష్ట
ప్రత్యేక దర్యాప్తు సిట్
APPSC
*అడుగడుగునా అక్రమాలు సిట్ నివేదికతో కలవర పడ్డ ప్రభుత్వం 165 మంది అధికారుల ఉద్యోగాలకు ఎసరు?*
*రవిశంకర్ అయ్యన్నర్ నాయకత్వంలో బయటపడ్డ స్కామ్*
నివేదిక వల్ల ఇప్పటికే మరి ఇతర పోస్టుల్లోను రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 165 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొంతమంది ఉద్యోగంలో చేరక పోయినా సుమారు 160 మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ దొడ్డి దారిన వచ్చిన అధికారుల్ని నెత్తి మీద పెట్టుకొని కాపాడుతూ వచ్చాయి. కానీ సిట్ నిష్పక్ష పాతంగా విచారణ జరిపి ఇచ్చిన నివేదిక వల్ల ప్రస్తుత ప్రభుత్వం మబ్బులు విడిపోయాయి. ఇప్పటికే జస్టిస్ భట్టు దేవానంద్ ఇచ్చిన ఆదేశాలవల్ల వీళ్ళను ప్రాధాన్యత లేని పోస్టులకు ప్రభుత్వం బదిలీ చేసింది.. ఇక సెప్టెంబర్ 1 న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నివేదికపై ఇచ్చే తీర్పు కోసం దగా పడ్డ వేలాది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1లో గోల్మాల్ సిట్ నివేదికతో బట్టబయలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 (నోటిఫికేషన్ నంబర్
27/2018) నియామక ప్రక్రియపై సిట్ జరిపిన సమగ్ర విచారణలో అనేక ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఎంపికైన 165 మంది అభ్యర్థుల ” అసలు సమాధాన పత్రాలు, స్కాన్ చేసిన ప్రతులు, ఓఎంఆర్ షీట్లను సీల్ చేసి సిట్ ఫొరెన్సిక్ పరీక్షల కోసం సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపింది. ఎంపికైన వారితో పాటు ఎంపికకానివారు, కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు మొత్తం 736 మంది అభ్యర్థుల పత్రాలను ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు, సిట్ ఆధారంగా పరిశీలించగా తీవ్రమైన విషయాలు వెల్లడయ్యాయి. పరిశీలించిన 736 పేపర్లలో 2 718 ລ້ລ້ (97.55%) ఓఎంఆర్ మూల్యాంకన స్లిప్పుల్లో దిద్దుబాట్లు, మార్పులు ఉన్నట్లు ఫారెన్సిక్ ల్యాబ్ తేల్చింది. ఈ దిద్దుబాట్ల వల్ల 197 మందికి మార్కులు పెరగ్గా, 222 మందికి మార్కులు తగ్గాయి.. మూల్యాంకన ప్రక్రియను నిశితంగా పరిశీలించినప్పుడు అధికారుల తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. 29 కేసుల్లో మూల్యాంకన అధికారుల ప్రారంభ సంతకాలు లేకుండానే దిద్దుబాట్లు జరిగాయి. 159 పేపర్లలో సంతకాలు సరిపోలకపోగా, 114 సందర్భాల్లో
వేర్వేరు సిరాలు వాడినట్లు గుర్తించారు. కేవలం 153 కేసుల్లో మాత్రమే చీఫ్ ఎగ్జామినర్ సంతకాలతో దిద్దుబాట్లు సరిపోలాయి.
ఇద్దరు అభ్యర్థుల సమాధాన పత్రాల్లో వేర్వేరు చేతిరాతలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారించగా, ఒక అభ్యర్థికి సంబంధించి వేర్వేరు వ్యక్తులు సమాధానాలు రాసినట్లు ఫొరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా నిర్ధారించింది. దీనిపై మరిన్ని విచారణలు అవసరమని సిట్ పేర్కొంది.
సిట్ చేసిన సమగ్ర విశ్లేషణ ప్రకారం, ఈ దిద్దుబాట్లు కేవలం ఎంపికైన 165 మందికే పరిమితం కాలేదు. ఎంపికకాని వారు, పిటిషనర్ల పేపర్లలోనూ ఇలాంటి మార్పులే ఉన్నాయి. అందువల్ల ఎంపికైన అభ్యర్థులకే ప్రత్యేకంగా లబ్ది చేకూర్చారని చెప్పలేమని, అయితే మూల్యాంకనదారులు, చీఫ్ ఎగ్జామినర్లు, పర్యవేక్షణ అధికారుల స్థాయిలో నిబంధనల ఉల్లంఘన, తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు సిట్ స్పష్టం చేసింది. అలాగే బార్కోడ్ల పరిశీలనలో 165 మందిలో 163 మంది బార్్కడ్లు సరిపోలాయి. మిగిలిన రెండింటిలో తేడాలు సిట్ వద్దకు రవాణా చేసే క్రమంలో భౌతిక మార్పిడి వల్ల జరిగాయని, దీనివల్ల మార్కుల్లో ఎలాంటి వ్యత్యాసం








