హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడలకు పోతున్నారని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ నెట్టింటా పోస్ట్ పెట్టారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే రాజ్యాంగ హక్కులను రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తున్నదంటూ కవిత విమర్శించారు. మృతిచెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం సరికాదంటూ ఆమె అందులో పేర్కొన్నారు.
Post Views: 20