Mahaa Daily Exclusive

  కొత్త‌ మండ‌లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌..

Share

  • సొనాల‌, భోర‌జ్‌, నూత‌న మండ‌లాలుగా ఉత్త‌ర్వులు
  • ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని హ‌ర్షిస్తూ ధ‌న్య‌వాదాలు తెలిపిన కంది శ్రీ‌నివాస‌రెడ్డి

 

ఆదిలాబాద్ మ‌హా : జిల్లాలో కొత్త మండ‌లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా లోని జైన‌థ్ మండ‌లం ప‌రిధిలో గ‌ల సాత్నాల, భోరజ్‌ల‌ను కొత్త‌గా మండలాలుగా ప్ర‌క‌టిస్తూ తాజాగా ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.

ప‌రిపాల‌న సౌల‌భ్యంతోపాటు మండలాల ఏర్పాటు ఆవశ్యకతను వివ‌రిస్తూ ప్రభుత్వానికి అనేకమార్లు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి విన్న‌వించారు. ఈ నేపథ్యంలో కొత్త‌ మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

జారీ కావ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నిర్ణ‌యంపై సంతోషం వ్య‌క్తం చేస్తూ కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌లో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రివ‌ర్యులు ధ‌న‌స‌రి సీత‌క్క‌, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డికి జిల్లావాసుల త‌ర‌పున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.