- సంబరపడుతున్న పుష్ప ఫ్యాన్స్
హైదరాబాద్, మహా
పుష్పను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అదేనండీ పుష్ప-2 హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందిస్తూ ట్వీట్ చేశారు. డిసెంబర్ – 5వ తేదీన పుష్ప-2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగానే ఇటీవల పుష్ప-2 సినిమా విడుదల సంధర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్రగ్స్ మహమ్మారిపై ఓ వీడియోను విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. యువత మత్తు బారిన పడవద్దని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని కోరారు. ఇలా అల్లు అర్జున్ వీడియో విడుదల చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ హీరో అల్లు అర్జున్, పుష్ప-2 టీమ్ కి అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేసి పుష్పను అభినందించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎంకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.