ఆదిలాబాద్ మహా : ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఓదార్చారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త షేక్ మోసిన్ ద్విచక్ర వాహనం పైనుండి కింద పడి కాలు విరగడంతో ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మౌనా శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసి యోగాక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24