కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి.
• తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం.
• ఆస్ట్రేలియాలో పార్టీ విస్తరణపై విస్తృత చర్చ.
• కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై కేటీఆర్‌తో నాగేందర్ రెడ్డి చర్చ.
హైదరాబాద్, మహా.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రానున్న రెండేళ్లలో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల గొంతుకగా నిలిచేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్‌తో నాగేందర్ రెడ్డి చర్చించారు.
ప్రభుత్వ విధానాలు, పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో సామాజిక మాధ్యమాల పాత్రపై కూడా చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు బీఆర్‌ఎస్ విధానాలు, పార్టీ పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ చేపట్టనున్న కార్యాచరణపై ఇరువురు నాయకులు చర్చించినట్లు తెలిపారు.
ఆస్ట్రేలియాలో బీఆర్‌ఎస్ కార్యకలాపాలను మరింత విస్తరించడం, పార్టీ కార్యక్రమాలకు ప్రవాస తెలంగాణవాసుల మద్దతును సమీకరించడం, తెలంగాణ ప్రయోజనాల కోసం సామాజిక, రాజకీయ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అదేవిధంగా కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపైనా ఇరువురు చర్చించారు. ఆస్ట్రేలియాలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడంలో కాసర్ల నాగేందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని కేటీఆర్ అభినందించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్ట్రేలియాలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు, ఆస్ట్రేలియాలోనూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి బీఆర్‌ఎస్ వాణిని బలంగా వినిపిస్తామని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలను ప్రవాస తెలంగాణవాసుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు వారి మద్దతును మరింతగా కూడగట్టేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.








