Mahaa Daily Exclusive

  కేటీఆర్ కుటుంబ చరిత్ర హీనమైనది….

Share

కేటీఆర్ కుటుంబ చరిత్ర హీనమైనది.
* హత్యలు, దోపిడీలే వారి నైజం.
* ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు!

నిజామాబాద్,మహా.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ కుటుంబ చరిత్ర అత్యంత హీనమైనదని, ఆ కుటుంబం దోపిడీలు, హత్యలకు పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ములేక గతంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనపై కూడా హత్యాయత్నం జరిగిందని ఆయన గుర్తుచేశారు.
ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలతో తాను మాట్లాడిన ఒక పాత వీడియోను ప్రస్తుతం వైరల్ చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. ఆ వీడియోపై స్పందిస్తూ తాను పూర్తి వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ముస్లింలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని మాత్రమే తాను సూచించినట్లు తెలిపారు.
అదే సమయంలో, ముస్లింలు తనకు ఓటు వేసినా, వేయకపోయినా నిజామాబాద్‌లో తానే విజయం సాధిస్తానని చెప్పానని వివరించారు. అయితే ఎవరికి ఓటు వేసినా బీజేపీనే గెలుస్తుందని తాను అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు సందర్భాన్ని పక్కనపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పాత వీడియోలను బయటకు తీసి విమర్శలు చేస్తున్నారని అర్వింద్ ధ్వజమెత్తారు.