జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం ప్రజాపాలన ప్రజా విజయో త్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అంతడుపుల నాగరాజు బృందం స్కిట్, కళాజాత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నాటక,నృత్యాల రూపంలో ప్రదర్శించారు. రైతులకు, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ఇనమడింపజేసిన కవులు కళాకారుల త్యాగాలను నృత్యాల రూపంలో తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుల పోరాటాలను జానపదాల ద్వారా వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించేలా చక్కటి కళజాత ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..
Post Views: 25