ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న గంధం నారాయణరావును గెలిపించాలని సత్రంపాడులోని ప్రైవేటు విద్యాసంస్థలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ గంధం నారాయణరావు 30 సంవత్సరాలకు పైగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ అధ్యాపకుల, లెక్చరర్ల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఎన్నో ఉద్యమాలలో పాల్గొని వైస్ ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారని తెలిపారు. విద్యారంగంలో ఆయన గడించిన అనుభవాన్ని అధ్యాపకుల,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో బలమైన గళాన్ని వినిపించగల నాయకునిగా గంధం నారాయణరావు ముందు వరసలో ఉన్నారని వారిని ఎమ్మెల్సీగా గెలిపించడం ద్వారా రెండున్నర దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీసురూల్స్ సమస్య పరిష్కారానికి కృషి చేసి పర్యవేక్షణాధికారుల
పోస్టుల భర్తీకి కృషి చేస్తారని,జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అర్హత గల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఇచ్చిన G.O.ను అమలు చేయించి రెగ్యులర్ చేయించుటకు కృషి చేయడంతో పాటు అధ్యాపకుల విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
డిసెంబర్ 5వ తేదీన జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధ్యాపకుల తమ ప్రాధాన్యత ఓటును ఒకటవ నంబర్లో ఉన్న గంధం నారాయణ రావు గారికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కురెళ్ళ వరప్రసాద్, కొండేటి రాంబాబు, శాయన అభిలాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.