శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు
ఆంధ్రప్రదేశ్ : శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు TTD చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల కల్యాణం లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. ఉచిత లడ్డూలే 70 వేలు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించనున్నారు.
Post Views: 21