- మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వెంకట రామ సింహాచలం
విజయనగరం, మహా
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా మిత్తిరెడ్డి వెంకట రామ సింహాచలం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంట రాగా విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో
నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మంత్రి కొండపల్లి ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేసిన రామసింహాచలం ఇది కేవలం నామినేషన్ కాదని, దత్తిరాజేరు ప్రజల పట్ల ఒక బాధ్యతను స్వీకరించే అడుగని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..
మండల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ ఫ్యూచర్ లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లు ఈ ప్రాంత ప్రగతికి, రాష్ట్రప్రగతికి చేస్తున్న కృషే దత్తిరాజేరు ప్రజల ఆదరణ టీడీపీకి అందిస్తున్నదన్నారు. తనకు ఈ అవకాశం అందించిన పార్టీ నాయకత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
………








