Mahaa Daily Exclusive

  ముగిసిన కోటమైసమ్మ జాతర 26న హుండి లెక్కింపు

Share

  • జాతరలో సేవలందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఈవో , చైర్మన్

కారేపల్లి, మహ : దసరా పండుగ రోజున ప్రారంభమైన కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మతల్లి జాతర శనివారంతో ముగిసింది. ఐదు రోజుల పాటి నిరంతరాయం సాగిన జాతరకు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి కోటమైసమ్మ అమ్మవారిని దర్శించుకోవటంతో పాటు జాతరలో సందడిగా గడిపారు. జాతరలో సింగరేణి సీఐ ఎన్ సాగర్, ఎస్సై బైరు గోపీ ఆధ్వర్యంలో పోలీసులు నిరంతర భద్రత పర్యవేక్షణతో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. జాతర కు వచ్చే వాహనాలను నియంత్రించటంలో పోలీసులు సఫలీకృతులైనారు. వైద్య సిబ్బంది సైతం పగలు సమయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాతరను కోటమైసమ్మ ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో కే.వెంకటయ్య లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆలయానికి వచ్చే అతిధులను ఆహ్వానిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. జాతర విజయవంతం కావటంలో కృషి చేసిన పోలీసు, ఇతర ప్రభుత్వశాఖల అధికారులకు ఈవో, ఆలయ చైర్మన్ లు కృతజ్ఞతలు తెలిపారు. జాతర హుండీ లెక్కింపు దేవదాయశాఖా ఉన్నతాధికారుల సమక్షంలో 26వ తేదిన నిర్వహించటం జరుగుతుందని వారుతెలిపారు.