Mahaa Daily Exclusive

  కోటమైసమ్మ జాతర ఆదాయం రూ.32.02 లక్షలు.. పెరిగిన రూ.2.92 లక్షల ఆదాయం…

Share

 

కారేపల్లి, మహ : కారేపల్లి మండల ఉసిరికాయలపల్లి శ్రీకోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాగంణంలో దసరా సందర్బంగా 5 రోజుల పాటు జరిగిన జాతర 23 తేది తో ముగిసింది. జాతర హుండీ, ఇతర ఆదాయాలను అధికారులు సోమవారం లెక్కించారు. ఈ ఏడాది జాతర అన్ని ఆదాయాలు కల్పుకోని రూ.32.02 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాబి రామారావు, ఆలయ ఈవో కట్టుకూరు వెంకటయ్య లు తెలిపారు. ఖమ్మం దేవాదాయ ఇన్‌స్పెక్టర్ ఆర్.సమత సమక్షంలో హుండీల లెక్కింపును చేపట్టారు. గత ఏడాది కంటే కేవలం రూ.2.92 లక్షల ఆదాయం పెరిగింది. జాతరలో దుకాణాల వేలం హక్కుల ద్వారా రూ.10.96 లక్షలు, హుండి ఆదాయం రూ. 8.02 లక్షలు, పూజా టిక్కెట్ల మ్మకాల ద్వారా రూ. 6.34 లక్షలు, షాపులకు స్ధల కిరాయిల ద్వారా రూ. 5.09 లక్షలు అమ్మవారి చీరల వేలం ద్వారా రూ. 57 వేలు, వాహన పూజ లైసెన్స్ ద్వారా రూ. రూ.లక్ష వచ్చినట్లు ఆధికారులు తెలిపారు. జాతరలో పూజల నిర్వాహణ ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాదితో పోల్చితే రూ.1.39 లక్షలు, వేలం ద్వారా 1.32 లక్షలు హుండి ఆదాయం రూ.60 వేలు, పూజా లైసెన్స్ ద్వారా రూ. 16 వేలు ఆదాయం పెరగగా షాపుల కిరాయిల ద్వారా ఆదాయం రూ.31 వేలు తగ్గగా, అమ్మవారి చీర అమ్మకం ద్వారా రూ.రూ.24 వేలు తగ్గింది. జాతర విజయవంతానికి కృషి చేసిన పోలీసు శాఖ, దేవాదాయశాఖ సిబ్బంది, వైద్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉసిరికాయలపల్లి గ్రామస్తులు, వాలంటీర్లకు, మీడియాకు ఆధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉసిరికాయలపల్లి సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మి రాజు, కార్యదర్శి భూక్య నిరంజన్, ఆలయ ప్రధాన అర్ఛకులు కొత్తలంక కైలాసశర్మ, దేవదాయశాఖ అధికారులు పగడాల మోహన్ కృష్ణ, మూడు మోహన్ చౌహన్, గణితి నారాయణ, పర్సా సత్యసాయిరాం, గ్రామ పెద్దలు బోడా బన్సీలాల్, ఇస్లావత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.