Mahaa Daily Exclusive

  ఖచ్చితమైన గణాంకాలే సమగ్ర అభివృద్ధికి పునాది…..

Share

  • ఖచ్చితమైన గణాంకాలే సమగ్ర అభివృద్ధికి పునాది
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
  • జనగణన–2027 రెండో దశ జనాభా గణన పై అధికారులకు శిక్షణ

వరంగల్, కలెక్టరేట్ మహా ;

జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా రెండో దశ జనాభా గణన నిర్వహణపై జిల్లా, సబ్‌ డిస్ట్రిక్ట్‌, ఛార్జ్‌ స్థాయి అధికారులకు ఈ నెల 27, 28 తేదీలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని జనగణన ప్రాముఖ్యత, జనాభా గణన నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాచార సేకరణలో ఖచ్చితత్వం, పారదర్శకత, అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంతో కీలకమని, ప్రజల నుంచి సేకరించే సమాచారం ఖచ్చితంగా, నిష్పక్షపాతంగా ఉండేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
జనగణనలో సేకరించే గణాంకాలు భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు కీలక ఆధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో హైదరాబాద్‌ కు చెందిన జిల్లా సెన్సస్ ఆపరేషన్స్ విభాగం ఎస్‌వో, శిక్షణ అధికారి సతీష్ అధికారులకు శిక్షణ అందించారు.

జనగణన విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని, క్షేత్రస్థాయిలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని సూచించారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా జనాభా గణన ప్రక్రియ, సమాచార నమోదు విధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సందేహాల నివృత్తి, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమ ఉమారాణిలు, ముఖ్య ప్రణాళిక అధికారి పి. చంద్రకళ, సంబధిత మండలాల తహసీల్దార్లు,
ఎస్‌వో సుభాష్ తదితరులు పాల్గొన్నారు.