Mahaa Daily Exclusive

  వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

Share

  • వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
  • 27 మంది పట్టివేత
  • రూ.10 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్, మహా : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసులు దాడి నిర్వహించారు. ది స్కై బై విహారా ఫామ్‌లో పేకాట ఆడుతున్న 27 మందిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గచ్చిబౌలి సీఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ దాడి నిర్వహించింది. ఈ పేకాటను చిన్న యాదవ్, (బి.ఎన్. రెడ్డి,)సోను (సన్‌సిటీ), నవీన్ అనే వ్యక్తులు గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ స్థావరంలో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల వరకు పేకాట లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. పోలీసుల దాడిలో 27 మంది వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు తదుపరి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.