Mahaa Daily Exclusive

  తెలంగాణ ఇక గ్లోబల్ స్పోర్ట్స్ హబ్.

Share

తెలంగాణ ఇక గ్లోబల్ స్పోర్ట్స్ హబ్.

* అథ్లెట్లకు సర్కార్ ఫుల్ సపోర్ట్!

* క్రీడాకారుల్లో జోష్ నింపిన మంత్రి శ్రీధర్ బాబు!

హైదరాబాద్, మహా.

దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను అమాంతం పెంచుతూ విశ్వవేదికపై సత్తా చాటే అథ్లెట్లకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కుండబద్దలు కొట్టారు. క్రీడల అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలతో సర్కార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందని ఆయన స్పష్టం చేశారు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ – 2026’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గురువారం మంత్రి శ్రీధర్ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. నవంబర్ 3వ తేదీన ప్రారంభమైన ఈ అంతర్జాతీయ స్థాయి హోరాహోరీ పోటీలు 8వ తేదీ వరకు కనులవిందుగా సాగనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాల్గొన్న మంత్రి.. క్రీడాకారులతో ముఖాముఖి మాట్లాడి వారిలో ఫుల్ జోష్ నింపారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడి పతకాలు సాధించే యువ క్రీడాకారులకు ప్రోత్సాహకాల విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకాడబోదని శ్రీధర్ బాబు గట్టి భరోసా ఇచ్చారు.