- ఫస్ట్ ఇయర్ రిపోర్ట్
- తెలంగాణలో దూసుకొస్తున్న కమలం
- కాంగ్రెస్ దే అగ్రాసనం .. కారుకు కష్టకాలం
హైదరాబాద్, మహా
తెలంగాణ రాష్ట్రంలో కమలం బలపడుతున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉన్నా.. క్రమంగా పట్టు గత ఏడాది స్థాయిలో లేదని జన్ లోక్ పాల్ సంచలన సర్వే విడుదల చేసింది. ఏడాది కాంగ్రెస్ పాలనపై జన్ లోక్ పాల్ సంచలన సర్వే బయటపెట్టగా, ఇందులో కమలంపార్టీ అనూహ్యంగా విస్తరిస్తున్నదని స్పష్టమైంది. కారుకు కష్టకాలం కొనసాగుతుండగా, ఎనిమిది మంది ఎంపీల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో కమలం విస్తరణ జరుగుతున్నదని స్పష్టమవుతోంది. కారు పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయని లోక్ జన్ పాల్ సర్వే వెల్లడించిది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయల్లో లోక్ జన్ పాల్ ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. దీంతో తాజా ట్రెండ్స్ పై ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా జన్ లోక్ పాల్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు 49 వరకు గరిష్టంగా స్థానాలు లభిస్తాయి. బిఆర్ఎస్ పార్టీ 22 నుండి 27లోపు స్థానాలు, బిజెపి 35-40 స్థానాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రజావిజయోత్సవాలు, సంక్షేమ ప్రగతి జాతర నేపథ్యంలో కాంగ్రెస్ స్వల్పంగా పుంజుకుని ఉండవచ్చునని పేర్కొంటున్నారు.
జన్ లోక్ పాల్ సర్వే
కాంగ్రెస్ : 49
బిజెపి : 35-40
బిఆర్ఎస్ : 22-27
ఎంఐఎం : 6-7
ఇతరులు : 1-2