Mahaa Daily Exclusive

  పేద మహిళ చనిపోతే బాధనిపించలేదా…? – మహేశ్ కుమార్ గౌడ్

Share

పేద మహిళ చనిపోతే బాధనిపించలేదా…?

చిరంజీవిని కేంద్ర మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే

బండి సంజయ్ పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాల రాద్దాంతం

నిజామాబాద్, మహా : అల్లు అర్జున్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఫైర్ టీ పీసీసీ చీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయ్యారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ తీరు ఉందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీ పీసీసీ చీఫ్. అల్లు అర్జున్ వ్యవహారంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ సమంజసంగానే ఉందన్నారు. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకు? అని బండి సంజయ్ కి సూటి ప్రశ్న వేశారు. సినీ పరిశ్రమపై మాకు కూడా ప్రేమ ఉంది కానీ ప్రజల ప్రాణాలే ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ అంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సినీ వర్గం నుంచి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ వ్యక్తులపై ద్వేషాలు ఉండవని, ప్రభుత్వానికి అందరూ సమానమే అని తేల్చి చెప్పారు. సెలబ్రిటీలైనంత మాత్రాన ఏదైనా చేస్తాం, ఏమైనా మాట్లడుతామంటే ఎలా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎవరైనా వ్య.వహరించవచ్చని, మహిళ చనిపోయిందని తెలిసినా కనీసం స్పందించకుండా తన సినిమా హిట్ కోసం రోడ్ షోలు చేస్తూ వెళ్ళడం ఏమిచని అడిగారు. అసెంబ్లీలో సీఎం చెప్పింది థప్పన్న సినీ నటుడు వాస్తవాలను పోలీసులు బయటపెట్టారని, ఇప్పటికైనా తప్పును తెలుసుకుని ప్రశ్చాత్తాపానికి రావాలన్నారు. ఈ విషయంలో సెలబ్రిటీకి కేంద్ర మంత్రి కొంత సలహా ఇస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రాన్ని యధేచ్చగా దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం అని విరుచుకుపడ్డారు. ఫార్ములా ఈ రేసింగ్ లో అడ్డంగా దొరికిపోయిన నేత కేటీఆర్ అని ధ్వజమెత్తారు. మొన్నటివరకు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన కేటీఆర్.. ఇపుడు కోర్టును ఆశ్రయిస్తున్నాడని విమర్శించారు.