Mahaa Daily Exclusive

  వేగం పుంజుకున్న ఈ కార్ రేస్ కేసు దర్యాప్తు ..

Share

  • ఇక కేటీఆరే తరువాయి
  • దానకిషోర్ విచారణతో కీలక పరిణామం
  • దాన కిషోర్ ను ఏడు గంటలు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు
  • త్వరలోనే నోటీసుల జారీకి ఏసీబీ నిర్ణయం

హైదరాబాద్, మహా : ఫార్ములా ఈ కార్ కేసు దర్యాప్తులో కీలక పరిణమాం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలు అందడంతో ఏసీబీ అధికారులు ఫిర్యాదు దారుడు. సీనియర్ ఐఎఎస్ అధికారి దాన కిషోర్ ను విచారించింది. దాన కిషఓర్ ను దాదాపు ఏడు ఘంటచల పాటు ప్రశఅనిచతిన ఏసీబీ అధికారులు అతడిచ్చిన స్టేట్ మనెంట్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి ిచారణకు రప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ కార్ రేసు కేసును నమోదు చేసిన ఏసీబీ కేటీఆర్ ను ఏ1 గా పేర్కన్న విషయం తెలిసిందే. ఏ 2గా పేర్కొన్న మరో ఐఎఎస్ అధికారి అఱవింద్ కుమార్ ను కూడా విచారణకు రావాలని నోటీసులను పంపాలని అధికారుల నిర్ణయించారు. దాన కిషోర్ విచరణ సందర్భఁగా ఏసీబ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను తీసుకున్నట్లు సమాచారం. దాన కిషఓర్ నుంచి తీసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్, అరవింద్ కుమార్ ల ముందు డాక్యుమెంట్లను ఉంచి చెల్లింపులపై ప్రశఅనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టబద్దమైన ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కార్ రేసును నిర్వహించారని, అలా నిర్వహించిన కార్యక్రమానికి నిబంధనలను ఉల్లంఘించి రూ. 46 కోట్ల మేర విదేశీ కరెన్సీని చెల్లించారని ఏసీబీ ప్రాథమికగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

 

విదేశీ మారకం చెల్లించే సమయంలో నిబంధనల మేరకు ఆర్బీఐ అనుమతిని తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదని ఏసీబీ విచారణలో తేలింది. ఈమొత్తం వ్.వహారంతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు సమగ్రంగా విచారించాలని ఏసీబీ బావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంత మందిని ప్రశఅనించిన ఏసీబీ అధఝికారులు వారి నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు. త్వరలోనే మరికొంత మందిని ప్రశ్నించనున్నారు. ఫార్మూలా సంస్థకు చెల్లించిన రూ. 5 కోట్లను ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరి ఖాతాలకు చేరాయి, ఆ ఖాతాలెవరివి అన్న విషయాలపై కూడా ఏసీబీ దృష్టిసారించింది. విదేశీ కరెన్సీని ఇచ్చారన్న అభియోగాలు ఉండటంతో ఇప్పటికే ీ వ్యవహారంపై ఈడీ కూడా కేసు నమోదు చేసేందుకు సన్నద్దం కావడం, కేసులో సేకరించిన ఆధారాలను తమకు కూడా ఇవ్వాలని లేఖ రాయడం తదితర పరిణామాల నేపథ్యంలో కేసులో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరుగకుండా చూడాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కర్త, ఖర్మ, క్రియ అంతా తానే అని, ఇందులో అధికారుల థప్పిదం ఏమీ లేదని ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేయడంతో కేటీఆర్ ను విచారిస్తే మొత్తం వ్యవహారంపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Latest