ఏపీ: కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్రం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందంటూ ఆమె విమర్శించారు. ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలన్నారు. దీనిపై ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ, కూటమి పార్టీ నాయకులు క్లారిటీ ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు సుమారు రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించాలన్నారు. అదేవిధంగా సొంత గనులను కేటాయించాలన్నారు. గత 1400 రోజులు కార్మికులు ఆందోళనలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదంటూ ఆమె సీరియస్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించిన తరువాతే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలన్నారు.







