Mahaa Daily Exclusive

  విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి త్వరలో జైలులో సిబ్బందిని పెంచుతాం- అనిత

Share

విశాఖ, మహా: విశాఖలోని సెంట్రల్‌ జైల్ ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సందర్శించారు. ముందుగా జైల్ శాఖ అధికారులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ… విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి సరాఫరా ఆరోపణలు వచ్చాయన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవలే జైలులో సెల్ ఫోన్లు బయటపడ్డ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, రానున్న రోజుల్లో ఇది పునరావృతం కాకుండా చూడాలని అదేశాలు జారీ చేశామన్నారు. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ లో ఎవరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జైలులో అధికారులు, సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించమని చెప్పారు.
ఎవ్వరిని ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. విచారణ చేసిన తరువాతే విశాఖ సెంట్రల్ జైలులో ఉద్యోగులను బదలీ చేస్తామన్నారు. ఎవ్వరిని సస్పెండ్ చేయలేదన్నారు. యూనిఫాం సర్వీసులో ఉన్నవారు ధర్నాలో, బంద్ లో పాల్గొనకూడదంటూ హితవు పలికారు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్ ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటామన్నారు. విశాఖ సెట్రల్ జైలు నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైలును విజిట్ చేసిన దాఖలాలు లేవని ఎద్దేవాచేశారు. టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరని పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిఫోర్ట్ వస్తుందన్నారు. త్వరలో జైలులో సిబ్బందిని పెంచుతామని తెలిపారు.

Latest