Mahaa Daily Exclusive

  హామీలు నిలబెట్టుకుంటున్నాం బిఆర్ఎస్ విధ్వసం.. కాంగ్రెస్ వికాసం – టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Share

రైతు భరోసా కింద రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 12 వేల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం మీడియాతో మీట్లాడుతూ బిఆర్ఎస్ విమర్శలపై విరుచుకుపడ్డారు. ఎకరాకు 10 వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల భరోసా ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో పాటు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి, ఆర్థిక విద్వంసం చేసిందని, అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అడ్డగోలు వ్యవహారాలు, కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన పనులు చేయడంతో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోయిందన్నారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎక్కడా వెనకపడకుండా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. రూ.22 వేల కోట్లతో రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేసామని, గత ఏడాది రైతు భరోసా ఇచ్చామని, ఈ ఏడాది జనవరి 26 నుంచి 12 వేల రూపాయలు ఎకరాకు భరోసా పెంచి ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకురూ. 12 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు.
ఇలాంటి గొప్ప పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రతిపక్ష బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ లు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మంచి పనులు చేసినా భరించలేకపోతున్నాయన్నారు. జనవరి 26 నుంచి చేపడుతున్న రైతు భరోసా కార్యక్రమాలపై ప్రజలు, రైతులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవాలన్నారు

Latest