Mahaa Daily Exclusive

  తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ సంస్థాగత పటిష్టత.. తాజా రాజకీయాలపై నజర్…!

Share

హైదరాబాద్, మహా
తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ రానున్న ఎన్నికలకు ఎలా సన్నద్దం కావాలనే అంశంపై కీలక భేటీ నిర్వహిస్తోంది. తెలంగాణ కేబినెట్ లో అనూహ్యంగా 13మాసాలుగా ఖాళీలుండగా, పిసిసి అధ్యక్షుడి నియామకం జరిగి నాలుగు నెలలవుతున్న నేపథ్యంలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేయాల్పి ఉంది. ఇంకా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు విపక్ష పార్టీల వ్యూహాలను ఆచితూచి గమనిస్తూ ముందడుగు వేయాల్సి ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, పెండింగ్ అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ఈనెల 8న తెలంగాణకు వస్తున్నారు. గాంధీభవన్ లో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన జరగనున్న పి.ఏ.సి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తాజా రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు నామినేటెడ్ పదవులు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల ప్రచారాల పై ఈ సందర్భంగా చర్చించనున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ తో మమేకం అవుతూ ఆదినుండీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నాగార్జునసాగర్ లో పర్యటించిన పిసిసి చీఫ్, ఎఐసిసి ఇన్ ఛార్జి దీపాదాస్ తో కలిసి సోమవారం ఆదిలాబాద్, మంగళవారం నిజామాబాద్, బుధవారం కరీంనగర్ జిల్లాల్లో సమావేశాల్లో పాల్గొంటారు.

క్యాడర్ ఎదురుచూపులు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికాగా, వరుస ఎన్నికల కారణంగా కేంద్రనాయకత్వం కూడా తెలంగాణపై సరైన ఫోకస్ పెట్టలేకపోయింది. లోక్ సభ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలపై ఇంతకాలం పనిచేసిన ఎఐసిసి నాయకత్వం ఇపుడు పాలిత రాష్ట్రాల కార్యక్రమాలు, పెండింగ్ అంశాలపై పోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్రాంతిలోగా పలు పదవులను హైకమాండ్ క్లియర్ చేసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఇపుడు ఉంటుందా.. బడ్జెట్ సమావేశాలకు ముందు చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక ఎన్నికల కంటే ముందే అటు ప్రజల్లో, ఇటు క్యాడర్ లో పూర్తి జోష్ తీసుకురావాల్సి ఉంది. తెలంగాణ కేబినెట్ తాజాగా రూ.12వేల రైతు భరోసా, 12వేల ఆత్మీయ భరోసాలను ప్రకటించింది. రేషన్ కార్డుల జారీకి షెడ్యూల్ రిలీజ్ చేసింది. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం వస్తుందన్న అంచనాలో పార్టీ ఉంది. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలపై పార్టీ మరింత ఫోకస్ చేయాల్సి ఉందని భావిస్తోంది. కేసీ వేణుగోపాల్ పర్యటన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో మరింత వేగం పెరిగే అవకాశాలున్నాయి.

Latest