Mahaa Daily Exclusive

  చిలకలూరిపేటలో మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ…!

Share

చిలకలూరిపేట వైసీపీ ఇంచార్జ్‌గా మళ్లీ మాజీమంత్రి విడదల రజినిని నియమించారు జగన్. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఆ మధ్య విడదల రజిని జనసేన వైపు చూస్తున్నారు..జంప్‌ అవుతారని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆమెను బుజ్జగించేందుకు తిరిగి చిలుకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఆమెకు పెద్దపీట వేయడం నచ్చని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ హర్ట్‌ అయ్యారట.

పార్టీ కోసం అన్నీ తానై నిలబడ్డ తనను కాదని..ఆమెకు టికెట్‌ ఇచ్చి.. అమాత్య పదవి ఆచ్చారు. అయినా సరే అని ఊరుకున్నా. ఇప్పుడు మళ్లీ ఆమెకు బాధ్యతలు ఇచ్చారు. ఇక నేనేందుకు మరి ఇక్కడ ఉండి అంటూ.. ఆగ్రహంతో ఉన్నారట మర్రి రాజశేఖర్. దాంతో మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా మారాయి చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ పాలిటిక్స్‌. రజిని రీఎంట్రీపై రగిలిపోతున్న మర్రి రాజశేఖర్‌..ఇక వైసీపీలో ఉంటే లాభం లేదని ఫిక్స్ అయిపోయారట.

Latest